: నేలపై కూర్చుని నిరసన తెలిపిన మెగాస్టార్ చిరంజీవి


టాలీవుడ్ అగ్ర నటుడు, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పై మూడు రోజులుగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు సహా పార్టీ నేతలంతా ఆందోళన కొనసాగిస్తున్నారు. నేటి ఆందోళనలో భాగంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది ముందుగా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ మరోమారు నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ ఆందోళనలో ముందు వరుసలో కింద నేలపై కూర్చున్న పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు పక్కన కూర్చున్న చిరంజీవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News