: హిరోషిమాపై బాంబు దాడి ఘటనకు 70 ఏళ్లు... నాటి మృతులకు మోదీ నివాళులు


జపాన్ లో నాటి ప్రధాన నగరమైన హిరోషిమా నగరంపై అణుబాంబు దాడి ఘటన జరిగి నేటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి ఘటనలో చనిపోయిన వేలాదిమందికి ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు తెలిపారు. "హిరోషిమా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందిరికీ నా శ్రద్ధాంజలి. నాటి బాంబు ఘటన అలాంటి యుద్ధాల వల్ల సంభవించే భయంకర దృశ్యాలను, మానవత్వంపై పడే ప్రభావాన్ని మనందరికీ గుర్తుకు తెస్తుంది" అని ప్రధాని ట్వీట్ చేశారు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకున్న సమయంలో ఆగస్టు 6న జపాన్ పై అమెరికా ఈ అణుబాంబు దాడికి పాల్పడింది. కొన్ని క్షణాలకే హిరోషిమా నగరం మొత్తం నేలమట్టమైంది. తరువాత కొన్ని రోజులకే అంటే అదే ఏడాది ఆగస్టు 9న నాగసాకి నగరంపై కూడా అమెరికా రెండో అణుబాంబును ప్రయోగించి ధ్వంసం సృష్టించింది. అయితే ప్రస్తుతం హిరోషిమా నగరం 12 లక్షల జనాభా, పెద్ద భవనాలతో జపాన్ లోనే అత్యంత ప్రత్యేక నగరంగా గుర్తింపు పొంది అభివృద్ధిలో దూసుకుపోతోంది.

  • Loading...

More Telugu News