: ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి


ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడికి పాల్పడి పలువురు అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఒంటినిండా పేలుడు పదార్థాలు అమర్చుకున్న ఓ ఉగ్రవాది రద్దీగా ఉన్న ప్రాంతంలోకి వచ్చి తనను తాను పేల్చి వేసుకున్నాడు. ఈ దారుణ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన లోఘార్ ప్రావిన్స్ లో ఈ ఉదయం సంభవించింది. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.

  • Loading...

More Telugu News