: తిరుమల శ్రీవారికీ తప్పని దొంగల బెడద
తిరుమల శ్రీవెంకటేశ్వరుని నివాసం ఆనంద నిలయానికి, ఆయన ఆస్తులకు, ఆయన్ను సేవించుకునే భక్తులకు రక్షణ నిమిత్తం ఎన్ని చర్యలు చేపట్టినా, అప్పుడప్పుడూ భక్తి ముసుగులో దొంగలు వస్తూనే ఉన్నారు. అటువంటి ఘటనే ఈ ఉదయం జరిగింది. తిరుమలలోని ఆలయం ప్రధాన హుండీలో దొంగతనం చేస్తూ దొరికిపోయాడో వ్యక్తి. హుండీ నుంచి రూ. 13 వేలు తీసుకుని వెళ్లిపోతున్న ఈ దొంగను సీసీ కెమెరాల్లో చూసిన విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను బెంగళూరు నుంచి వచ్చాడని తెలుస్తోంది. ఇతన్ని పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.