: ఇక ‘టెట్రా’ లిక్కర్!... అక్టోబర్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా విక్రయం


అక్టోబర్ నుంచి తెలంగాణ పల్లెల్లో మద్యం సీసాలకు బదులు ‘టెట్రా’ లిక్కర్ మందుబాబులకు విందు చేయనుంది. గుడుంబాకు చెక్ పెట్టేందుకు సర్కారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొత్త రూపంలో మద్యం దర్శనమివ్వనుంది. కొత్త రాష్ట్రం తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా క్వార్టర్ (180 మిల్లీ లీటర్లు) కంటే చిన్న మొత్తాల్లో మద్యాన్ని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 90 మిల్లీ లీటర్ల పరిమాణంలోనూ మద్యాన్ని విక్రయించనున్నారు. ఇందుకోసం టెట్రా ప్యాక్ లను ప్రభుత్వం వాడనుంది. ఈ మేరకు నిన్న ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కొత్త మద్యం పాలసీపై పూర్తి స్థాయిలో సమీక్ష చేశారు.

  • Loading...

More Telugu News