: 5 కోట్ల మంది ఏపీలో ఉంటే, 25 వేల మందితో హైదరాబాద్ నుంచి పాలన ఏంటి?: చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి


5 కోట్ల మందికి పైగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే, 25 వేల మంది ఉద్యోగులు హైదరాబాదులో కూర్చుని పాలన సాగించడమేంటన్న ఒత్తిడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పెరుగుతోందట. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. పలు వర్గాల నుంచి తక్షణం ఉద్యోగులను తరలించాలన్న వినతులు వస్తున్నాయని తెలిపారు. అందువల్లే, ఉద్యోగులందరినీ ఒకేసారి తరలించాలని నిర్ణయించామని, అంతకన్నా ముందు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. అమరావతి ప్రాంతంలో సౌకర్యాలు లేకుండా పనిచేయడం సాధ్యం కాదని ఉద్యోగ సంఘాల నేతలు కృష్ణారావు ముందు అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు, హైదరాబాదులో అందరికీ ప్రభుత్వమే వసతి, సదుపాయాలు కల్పించలేదు కదా? అని అన్నారు. కొన్నిసార్లు త్యాగం చేయాల్సి వుంటుందని, వసతుల కల్పనపై ఉద్యోగులే సభ్యులుగా ఓ కమిటీని వేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News