: స్పష్టత లేకుండా ఆదేశాలేంటీ?... పోర్న్ సైట్ల నిషేధ ఉత్తర్వులపై ఐఎస్పీల మండిపాటు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పోర్న్ సైట్ల నిషేధంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ) మాత్రం తమ కార్యాలయాల్లో తలలు పట్టుకుని కూర్చున్నారు. ఎందుకంటే, పోర్న్ సైట్లపై నిషేధం విధించాలని కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేదట. అసలు ఏదేనీ సైట్ ను పోర్న్ సైట్ గా ఎలా నిర్ధారిస్తారనే విషయంపై సదరు ఉత్తర్వుల్లో స్పష్టత లేదట. ప్రత్యేకించి చిన్నారుల అశ్లీల వెబ్ సైట్లను కనుగొనే సాధనాలు తమ వద్ద లేవని వారు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. ఆదేశాలు జారీ చేసిన చేతులతోనే సదరు వెబ్ సైట్ల పేర్లను కూడా అందజేయండంటూ అభ్యర్థిస్తున్నారు. ఇక కొంతమందైతే, పోర్న్ సైట్లకు సంబంధించి నిర్దిష్టమైన జాబితా ఇస్తే కాని వాటిపై నిషేధం అమలు చేయలేమని తేల్చిచెప్పారని వినికిడి.