: మోదీ, సుష్మాలను ఆకాశానికెత్తేసిన వెంకయ్య... సరికొత్త అభివర్ణనల ఆపాదన


బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడే. ఒక్క మోదీకే కాదు, పార్టీలోని అందరికీ వెంకయ్య అనుకూలుడిగానే ముద్రపడ్డారు. ఇక సొంత పార్టీ నేతలను వెనకేసుకురావడంలో వెంకయ్యను మించిన వారు లేరనే చెప్పాలి. తన పార్టీ నేతలపై విపక్షాలు సంధించే విమర్శలను తిప్పికొట్టడంలో తనకు సాటి రాగల నేతలెవరూ లేరని నిన్న వెంకయ్య మరోసారి నిరూపించారు. నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్వా స్వరాజ్ లపై విపక్షాలు చేసిన దాడిని తిప్పికొట్టే క్రమంలో వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ దేశ ప్రజలకు దేవుడిచ్చిన బహుమానం ప్రధాని నరేంద్ర మోదీ. భారత జాతి ఆస్తి సుష్మా స్వరాజ్’’ అని వెంకయ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News