: అవినీతి కేసులో గోవా మాజీ మంత్రి అరెస్ట్... కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కామత్


గోవాలో 2010లో వెలుగు చూసిన అవినీతి కుంభకోణం ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణలకు చెందిన భారీ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు అమెరికాకు చెందిన కన్సల్టెంట్ సంస్థ లూయీస్ బెర్గర్ నాటి గోవా కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన చర్చిల్ అలెమోకు భారీ ఎత్తున ముడుపులు సమర్పించుకుందన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో నాటి సీఎం దిగంబర్ కామత్ పేరు కూడా ఉంది. కేసు దర్యాప్తు చేపట్టిన గోవా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ పేరిట చర్చిల్ ను నిన్న పిలిపించి అరెస్ట్ చేశారు. దీంతో తననూ అరెస్ట్ చేస్తారన్న భయంతో దిగంబర్ కామత్ కోర్టులను ఆశ్రయించారు. సెషన్స్ కోర్టుతో పాటు జిల్లా కోర్టులోనూ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News