: మేధోవలస లేదు... స్వదేశానికి తిరిగొస్తున్నారు: కేంద్రం


దేశంలో మేధావులు విదేశాలకు వలస వెళ్లడం అధికమైందన్న వాదనలను కేంద్రం తోసిపుచ్చింది. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ... విదేశాల్లో ఉన్న వందలాది మంది భారత మేధావులు ఇప్పుడు స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారని తెలిపారు. శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. పరిశోధన సంస్థలు, ప్రయోగశాలలకు మరిన్ని నిధులు అందిస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఉన్న 600 మందికి పైగా భారత శాస్త్రవేత్తలు దేశంలోని వివిధ ఫెలోషిప్ ల కొరకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని మంత్రి వివరించారు. దేశంలోని పలు కీలక సంస్థలను వీడుతున్న శాస్త్రవేత్తల శాతం పెరుగుతోంది కదా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ... అది అవాస్తవమని కొట్టిపారేశారు. రెండు శాతం కన్నా తక్కువ మందే భారత్ లోని పరిశోధక సంస్థలను, ప్రయోగశాలలను వీడుతున్నారని తెలిపారు. అలాంటి వారందరూ వ్యక్తిగత కారణాలు, కుటుంబ పరమైన సమస్యలతో వెళ్లిపోతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News