: నెల్లూరులో పట్టపగలు తుపాకులతో వచ్చి భారీ దోపిడీ
నెల్లూరులో ఈ ఉదయం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలు ఆయుధాలతో వచ్చి భారీ దోపిడీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... నగరంలోని కాపు వీధిలో ఉన్న జయంతి జ్యూయలర్స్ దుకాణంలోకి తుపాకులు ధరించిన దుండగులు జొరబడ్డారు. షాపు యజమానిని తాళ్లతో కట్టేసి మూడు కిలోల బంగారు నగలు, రూ. 50 లక్షల నగదును లూటీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దోపిడీ జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. షాపు యజమాని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు నగరం నుంచి బయటకు వెళ్లే దారులపై సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని లాడ్జీలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.