: ర్యాగింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్... ఆచార్య నాగార్జునలో వెలసిన బోర్డులు, ముగిసిన సెలవులు


వరంగల్ కు చెందిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యతో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నివురు గప్పిన నిప్పులా కనిపిస్తోంది. రిషితేశ్వరి ఆత్మహత్య అనంతరం విద్యార్థుల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో వర్సిటీకి ప్రకటించిన సెలవులు నిన్నటితో ముగిశాయి. దీంతో నేటి ఉదయం నుంచి వర్సిటీకి విద్యార్థుల రాక ప్రారంభమైంది. వర్సిటీకి వస్తున్న విద్యార్థులను గేటు వద్దే నిలిపేస్తున్న పోలీసులు పూర్తిగా సోదాలు చేసిన తర్వాత కాని లోపలికి అనుమతించడం లేదు. ఇక ర్యాగింగ్ భూతానికే రిషితేశ్వరి బలైపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో వర్సిటీలో ఈ విష సంస్కృతిపై అధికారులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. వర్సిటీ ప్రాంగణంలో ‘ర్యాగింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్’ అన్న వార్నింగ్ బోర్డులు కొత్తగా వెలిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్సిటీలో ఈ బోర్డులు కనిపిస్తుండటంతో విద్యార్థులు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.

  • Loading...

More Telugu News