: ఢిల్లీలో నెలకు ఆరు లక్షల అత్యాచారాలకు ప్రభుత్వం అనుమతిస్తోంది: మహిళా కమిషన్ సంచలన వ్యాఖ్యలు


ఢిల్లీలోని జీబీ రోడ్ లో ఉన్న వ్యభిచార గృహాల్లో జరుగుతున్న తంతును అత్యాచారంతో పోలుస్తూ ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతీ మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నెలకు ఆరు లక్షల కండోములు జీబీ రోడ్ లో పంపిణీ చేస్తున్నామని, అంటే ప్రభుత్వం ఆరు లక్షల అత్యాచారాలకు అధికారిక అనుమతి ఇస్తున్నట్టని తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ఆమె వెల్లడించారు. వెలుగులోకి రాని మైనర్ సెక్స్ వర్కర్ల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే అత్యాచారాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఆమె అన్నారు. వ్యభిచారాన్ని ప్రజలు సైతం ఆమోదించడం ఘోరమని ఆమె అన్నారు. "జీబీ రోడ్డుకు వెళ్లి అక్కడి పరిస్థితి చూసి వచ్చిన తరువాత నేను ఎంతో మందితో మాట్లాడాను. రెడ్ లైట్ ఏరియాను మూసేస్తే అత్యాచారాల సంఖ్య పెరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విధమైన మైండ్ సెట్ ఉండటం దురదృష్టం" అని వివరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ను నివారించే దిశగా ఎన్జీవోలు, కేంద్రంతో కలసి పనిచేస్తామని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News