: పాత్రికేయుల పట్ల బెదిరింపు ధోరణిలో కేసీఆర్ ప్రభుత్వం: ఎడిటర్స్ గిల్డ్ విమర్శ
మీడియాను, పాత్రికేయుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేస్తూ, బెదిరింపు ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ విమర్శలు చేసింది. ప్రముఖ మ్యాగజైన్ 'అవుట్ లుక్' ప్రచురించిన ఓ వ్యంగ్య కథనంపై కేసీఆర్ సర్కారు తీసుకున్న చర్యలను గిల్డ్ అధ్యక్షుడు ఎన్.రవి తప్పుబట్టారు. సదరు కథనంపై ఇప్పటికే అవుట్ లుక్ విచారం వ్యక్తం చేసిందని గుర్తు చేసిన ఆయన, దాన్ని రాసిన విలేకరి అక్రిడేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు పెట్టి, విచారణ పేరిట వేధించడం అధికార దుర్వినియోగమేనని ఆక్షేపించారు. ఇది ఒక పత్రికపై తీసుకున్న చర్య కాదని, మొత్తం మీడియాను, పత్రికా స్వేచ్ఛను లొంగదీసుకునే ప్రయత్నమేనని అన్నారు. మీడియాపై వైఖరిని మార్చుకోవాలని కోరారు.