: మిలిటరీ వ్యాన్ బీభత్సం... మూడు బైకులను ఢీ కొట్టిన వైనం, ఒకరి మృతి


భారత సైన్యానికి చెందిన మిలిటరీ వ్యాన్ ఒకటి సికింద్రాబాదు పరిధిలోని బోయిన్ పల్లిలో కొద్దిసేపటి క్రితం బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న బోయిన్ పల్లి ప్రాంతంలో సైనికులను తరలిస్తున్న మిలిటరీ వ్యాన్ ఉన్నట్టుండి అదుపు తప్పింది. ముందుగా వెళుతున్న వాహనాలను ఢీకొట్టడమే కాక పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో మిలిటరీ వ్యాన్ మూడు బైకులను ఢీకొట్టేసింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. పలువురు గాయపడ్డారు. వెనువెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News