: హైదరాబాదులో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం


ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన హైదరాబాదులోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఆకాంక్ష అనే విద్యార్థిని కుషాయిగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. నిన్న కాలేజ్ కు వెళ్లిన ఆమె సాయంత్రమైనా తిరిగిరాలేదు. దీంతో, కంగారు పడ్డ ఆమె తల్లిదండ్రులు కాలేజీతో పాటు, ఆమె స్నేహితులను కూడా విచారించారు. కానీ, ఎలాంటి ఫలితం కనపడలేదు. దీంతో, ఈ ఉదయం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకాంక్ష కోసం గాలింపు మొదలు పెట్టారు.

  • Loading...

More Telugu News