: జానీ డెప్, డికాప్రియో, బ్రాడ్ పిట్ లకన్నా ధనవంతులు బాలీవుడ్ హీరోలు: ఫోర్బ్స్


ప్రముఖ హాలీవుడ్ హీరోలు జానీ డెప్ (పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫేం), లియొనార్డో డికాప్రియో (టైటానిక్ ఫేం), బ్రాడ్ పిట్ (ట్రాయ్ ఫేం)ల కన్నా, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లు ధనవంతులని ప్రముఖ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనిక హీరోల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించగా, టాప్-10లో బాలీవుడ్ హీరోలు ముగ్గురికి స్థానం లభించింది. సల్మాన్, అమితాబ్ లు (7వ స్థానం) ఇద్దరికీ రూ. 214 కోట్ల ఆస్తులున్నాయని, వారి తరువాత అక్షయ్ కుమార్ 8వ స్థానంలో నిలిచారని (రూ. 208 కోట్లు) మ్యాగజైన్ వెల్లడించింది. షారూక్ ఖాన్ 19వ స్థానంలో రణబీర్ కపూర్ 32వ స్థానంలో నిలిచారని వెల్లడించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో రాబర్ట్ డౌనీ జూనియర్ (ఐరన్ మ్యాన్ ఫేం) తొలి స్థానంలో (రూ. 500 కోట్లు) నిలువగా, జాకీ చాన్ రెండో స్థానంలో, విన్ డీజిల్ (ఫ్యూరియస్ 7 ఫేం) మూడవ స్థానంలో నిలిచారు. బెన్ అఫ్ లెక్ (మాస్క్ ఆఫ్ జోరో ఫేం), విల్ స్మిత్ (మెన్ ఇన్ బ్లాక్ ఫేం)లు షారూఖ్ కన్నా తక్కువ ఆస్తులను కలిగి ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News