: ఉత్తరప్రదేశ్ న్యాయస్థానంలో జంట బాంబు పేలుళ్లు


ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ జిల్లా న్యాయస్థానంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. మధ్యాహ్నం సమయంలో జంట బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో బాంబ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగిన పోలీసులు, విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే ఈ బాంబు పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. మరో రెండు రోజుల్లో లాయర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పేలుళ్లు జరగడం విశేషం. ఎన్నికల నేపథ్యంలో బాంబు పేలుళ్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News