: భారత్ లో ఎంతకాలమైనా ఉండేందుకు గాయకుడు అద్నాన్ సమీకి కేంద్రం అనుమతి


పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చి పాప్యులర్ గాయకుడిగా పేరొందిన అద్నాన్ సమీకి ఎంతకాలమైనా ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2001లో భారత్ వచ్చిన సమీ ఎప్పటికప్పుడు తన వీసా పునరుద్ధరించుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. అయితే సమీ వీసా గడువు మే 26తో ముగియడంతో రెన్యువల్ కు కూడా అవకాశం లేకుండాపోయింది. దాంతో ఈ గాయకుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. మానవతా దృష్టితో తాను భారత్ లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఆయన భారత్ లో ఉండేందుకు అంగీకారం తెలిపింది.

  • Loading...

More Telugu News