: ఇండియాపై దాడి చేసింది మనవారే!: 26/11పై పాక్ విచారణాధికారి


2008, నవంబర్ 26న ఇండియా ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన ఉగ్రదాడి వెనకున్నది పాకిస్థాన్ వాసులేనని, కుట్ర జరిగింది కూడా పాక్ లోనేనని, ఆ కేసులో ప్రభుత్వం ఆదేశాల మేరకు విచారణ జరిపిన అధికారి తేల్చిచెప్పారు. దీంతో దాడి పాకిస్థాన్ పనేనని ఇండియా చేస్తున్న వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. "నిజాన్ని ఎదుర్కొనేందుకు తప్పులను అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. పాకిస్థాన్ గడ్డ నుంచే దాడికి ప్రణాళిక జరిగింది" అని విచారణ జరిపిన ఎఫ్ఐఏ (ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) హెడ్ తారీక్ ఖోసా తెలిపారు. ఈ మేరకు 'డాన్' పత్రికలో ఆయన సంపాదకీయం రాశారు. ఇండియా చెబుతున్న వర్షన్ కు మద్దతిస్తూ, 2008లో జరిగిన దాడిలో పాల్గొన్న 10 మందీ పాకిస్థాన్ నుంచి సముద్రమార్గం ద్వారానే ముంబై చేరానని అన్నారు. ఈ 10 మందీ 166 మందిని హతమార్చారని, అజ్మల్ కసబ్ ఒక్కడే దొరికిపోయాడని, అతను పాకిస్థాన్ జాతీయుడని తెలిపారు. స్కూలు దశలోనే కసబ్ ఓ నిషేధిత మిలిటెంట్ సంస్థలో చేరి, థాటా వద్ద శిక్షణ తీసుకున్నాడని, ముంబైలో వాడిన పేలుడు పదార్థాలు, మిలిటెంట్ క్యాంపు నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో వాడిన రసాయనాలు ఒకటేనని తెలిపారు.

  • Loading...

More Telugu News