: రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన 'నాయూ' ప్రొఫెసర్


గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీలో కలకలం రేపిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి సూసైడ్ కేసులో ప్రిన్సిపల్ బాబూరావుపై ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ డేవిడ్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రిషితేశ్వరి సూసైడ్ చేసుకున్న రోజున ఆమె ఇంకా బతికే ఉందని రిపోర్టు రాసిమ్మని మెడికల్ ఆఫీసర్ పై ప్రిన్సిపల్ బాబూరావు ఒత్తిడి చేశారని ఆచార్య డేవిడ్ రాజు ఆరోపించారు. బాబూరావు మద్యంతాగి క్లాసుకు వస్తారని ఆయన తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల పాటు స్టాఫ్ రూంలోని నిద్రపోతారని ఆయన వెల్లడించారు. బాబూరావు అమ్మాయిలను వేధించడం వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. బాబూరావు ఆగడాలు భరించలేక ఇద్దరు మహిళా స్టాఫ్ వెళ్లిపోయారని ఆయన తెలిపారు. విద్యార్థులు ప్రిన్సిపల్ కు మందుపార్టీ ఇవ్వాలని, లేని పక్షంలో మార్కులు వేయకుండా వేధిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చరిత్ర ఉందనే గతంలో బాబూరావు పనిచేసిన కాలేజీలు ఆయనను తీసేశాయని డేవిడ్ రాజు వెల్లడించారు. నాగార్జున యూనివర్సిటీలో ఓ కులం ఆగడాలకు అడ్డేలేకుండా పోతోందని ఆయన విమర్శించారు. ఇవే ఆరోపణలు చేస్తూ విద్యార్థులు అందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతే యూనివర్సిటీ యాజమాన్యం సెలవులు ఇచ్చి, బహిరంగ విచారణ నిర్వహించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News