: సీసీఎస్ విచారణకు అవుట్ లుక్ జర్నలిస్టు...స్మితా సభర్వాల్ ‘కథనం’పై ప్రశ్నల వర్షం
తెలంగాణ యువ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ను కించపరిచేలా కథనం రాసిన ఘటనపై విచారణలో హైదరాబాదు సీసీఎస్ పోలీసులు వేగం పెంచారు. ఈ కథనాన్ని రాసిన అవుట్ లుక్ జర్నలిస్ట్ మాధవి టాటా నేటి ఉదయం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మితా సభర్వాల్ పై కథనం రాయాల్సిన అవసరం ఏమిటని, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందన్న కోణాల్లో పోలీసులు మాధవి టాటాకు ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్న స్మితా సభర్వాల్, ఫ్యాషన్ షోకు హాజరయ్యారని ఓ గాసిప్ కథనాన్ని రాయడమే కాక జీన్ ప్యాంట్ వేసుకున్నట్లున్న స్మితా క్యారికేచర్ ను అవుట్ లుక్ పత్రిక ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై స్మితా భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.