: ప్రత్యేక హోదా క్లిష్ట సమస్య... విభజన చట్టంలో పొందుపర్చలేదు: వెంకయ్యనాయుడు
ఏపీ పరిస్థితి, ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లోక్ సభలో క్లుప్త వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదా క్లిష్ట సమస్య అని, విభజన చట్టంలో దాన్ని పొందుపర్చలేదని చెప్పారు. అయితే హోదాపై ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని చెప్పారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇదే సమయంలో ఉమ్మడి హైకోర్టు విభజించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు కోరడంపై వెంకయ్య మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగాక రెండు రాష్ట్రాలకు హైకోర్టులు వేరుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇందులో సబ్ జ్యుడిస్ (కోర్టులో వున్న అంశం) ఉందని, అయినా దానిపై మరోసారి పరిశీలన చేయాలని న్యాయశాఖ మంత్రిని కోరతామన్నారు. సాధ్యమైనంత త్వరలో హైకోర్టు సమస్యను పరిష్కరిస్తామన్నారు.