: తహశీల్దార్ వనజాక్షికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ మద్దతు


కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షిని చంపుతామంటూ బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సినీ నటుడు హరికృష్ణ మద్దతు తెలిపారు. ఆమెకు వచ్చిన బెదిరింపు లేఖను తీవ్రంగా ఖండిస్తున్నానని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. వనజాక్షికి అండగా ఉంటామని, చంపుతామంటూ బెదిరింపు లేఖ రాసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారకులైన వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టకూడదన్నారు.

  • Loading...

More Telugu News