: ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు... మోదీ సర్కారుపై రాహుల్ ఫైర్


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై లోక్ సభ స్పీకర్ సస్పెన్షన్ విధించడాన్ని నిరసిస్తూ నేటి ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ నిరసనకు దిగింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అగ్రనేతలతో కలిసి రాహుల్ దండు అక్కడికి కదిలి వెళ్లింది. నిరసన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఒకేసారి 25 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని ఆయన ఆరోపించారు. సభను సజావుగా నిర్వహించడం మోదీ సర్కారుకు చేతకాదని కూడా రాహుల్ ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News