: ఉరికి ముందు యాకూబ్ మెమన్ ఆఖరి మాటలివే!
మరికొద్ది క్షణాల్లో చనిపోతానని తెలిసిన సమయంలో ఓ వ్యక్తి ఏం మాట్లాడతాడు? అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? గత వారం నాగపూర్ జైల్లో ఉరితీయబడ్డ 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరికి కొన్ని క్షణాల ముందు ఎలా ఉన్నాడు? ఏమన్నాడు? అన్న విషయాలను ఆ సమయంలో అక్కడే ఉన్న అధికారుల్లో ఒకరు చెప్పారు. "మీరంతా కేవలం మీ విధిని నిర్వహిస్తున్నారు. నేను మిమ్మల్ని క్షమిస్తున్నా. నాకు, దేవుడికి మాత్రమే అసలు నిజమేంటో తెలుసు" అని మెమన్ వ్యాఖ్యానించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ఉరికంబం ఎక్కిన తరువాత యాకూబ్ నిశ్చలంగా ఉన్నాడని ఓ అధికారి చెప్పినట్టు పేర్కొంది. యాకూబ్ ఉరిని ఆపేందుకు ఆయన తరపు న్యాయవాదులు చివరి క్షణం వరకూ ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే.