: ముల్లా ఒమర్ కుమారుడినీ చంపేశారు!


తాలిబన్ల మాజీ నేత, ఎన్నడో హతమయ్యాడని ఇటీవల రూఢీ అయిన ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యూకూబ్ (22) పాకిస్థాన్ లో మృతి చెందినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం పాక్ లోని క్వెట్టా ప్రాంతంలో యాకూబ్ ఓ సమావేశం నిర్వహిస్తుండగా, సైన్యం చంపేసిందని ఆప్ఘనిస్తాన్ ప్రజాప్రతినిధి ఒకరు ప్రకటించారు. యాకూబ్ మృతిచెందిన విషయాన్ని ఆప్ఘన్ డిప్యూటీ స్పీకర్ ఓలేసీ జిర్గా వెల్లడించినట్టు 'తోలో న్యూస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కాగా, ముల్లా ఒమర్ మరణించాడని ఖరారైన తరువాత తదుపరి తాలిబన్ నేతగా నిలిచేందుకు యాకూబ్, మన్సూర్ (ప్రస్తుత తాలిబన్ చీఫ్) మధ్య పోటీ పెరిగిందని, యాకూబ్ మరణం వెనుక మన్సూర్ హస్తం ఉండవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News