: కృష్ణా జిల్లాలో జగన్...విష జ్వరాలతో చనిపోయిన వారి కుటుంబాలకు పరామర్శ


వైకాపా అధినేత జగన్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్త మాజేరులో విష జ్వరాలతో చనిపోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ క్రమంలో, ఈ ఉదయం హైదరాబాదు నుంచి బయల్దేరి 8.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కొత్త మాజేరుకు బయల్దేరారు. పరామర్శల అనంతరం సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి హైదరాబాద్ బయల్దేరుతారు.

  • Loading...

More Telugu News