: లోక్ సభలో వైసీపీ ‘ప్రత్యేక’ వాయిదా తీర్మానం
ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష వైసీపీ గళమెత్తనుంది. ఈ మేరకు నేటి లోక్ సభ సమావేశాల్లో భాగంగా ఆ పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించనుంది. కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని సభలో డిమాండ్ చేయాలని సమావేశం తీర్మానించింది. మరికాసేపట్లో వాయిదా తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఆ పార్టీ ఎంపీలు అందజేయనున్నారు.