: 'ఫొటో తియ్' అంటే సెల్ఫీ వచ్చేస్తుంది... వాయిస్ కంట్రోల్ సిస్టమ్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్


మీరు స్మార్ట్ ఫోన్ నుంచి సెల్ఫీ తీసుకునే సమయంలో బటన్ ను తాకడానికి ఇబ్బంది పడ్డారా? ఫోన్ షేక్ అయి పిక్చర్ సరిగ్గా రాలేదని మరోసారి ప్రయత్నించారా? అయితే, మీ కష్టాన్ని తొలగించేందుకు సరికొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వాయిస్ ఫోటో కంట్రోల్ సిస్టమ్ సదుపాయంతో లభించే ఈ ఫోన్ లో మొబైల్ ను సెల్ఫీ తీసుకునేందుకు సిద్ధంగా ఉండి, ముందుగా రికార్డు చేసుకున్న ఏదైనా పదం ఒకటి పలికితే, ఫోటో దానంతట అదే నిక్షిప్తమై పోతుంది. ఉదాహరణకు 'క్లిక్', 'కాప్చర్', 'ఫోటో తియ్' ఇలా ఏదైనా అనొచ్చు. ఈ ఫోన్ ను లావా సంస్థ 'ఐరిస్ ఎక్స్-1' పేరిట మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సెల్ఫీలు మరింత సులువుగా తీసుకోవచ్చని సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News