: ఊరు వదిలి వెళ్లకపోతే చంపేస్తాం... ముసునూరు తహశీల్దార్ కు బెదిరింపు లేఖ
కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ అందింది. అక్రమ ఇసుక రవాణా వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తో గొడవ నేపథ్యంలో వనజాక్షి పేరు మీడియా పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ప్రస్తుతం ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెకు ‘సీఎన్ టీపీ’ పేరుతో నిన్న ఓ లేఖ అందింది. 10 రోజుల్లోగా ఊరు వదిలి వెళ్లకపోతే చంపేస్తామని ఆ లేఖలో వనజాక్షికి బెదిరింపులు వచ్చాయి. ఈ లేఖ అటు రెవెన్యూ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.