: కృష్ణా జలాల వ్యవహారంలో రాయలసీమకు పూర్తిగా అన్యాయం జరుగుతోంది: జేసీ
కృష్ణా నది ఎగువన కట్టిన ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. దాంతో ఈ జలాల వ్యవహారంలో సీమకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమతో రాయలసీమ కల నెరవేరాలంటే వాతావరణం అనుకూలించాలని పేర్కొన్నారు. ఐదేళ్లుగా వచ్చిన ప్రాజెక్టులతో రాయలసీమ అన్యాయానికి గురవుతోందని, సీమకు ప్రత్యేకంగా కేటాయింపులు కావాలని కోరతానని చెప్పారు. అవసరమైతే కృష్ణా బోర్డు నుంచి సుప్రీంకోర్టు వరకు సీఎం సహా అందరినీ మరోసారి కలుస్తానని జేసీ తెలిపారు. ప్రైవేటు వ్యక్తిగా రాయలసీమకు అన్యాయంపై సుప్రీంను కూడా ఆశ్రయిస్తానన్నారు. ఆల్మట్టి నిండితే తప్ప రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆయన తేల్చి చెప్పారు.