: స్మగ్లింగ్ చేశాయంటూ 57 గార్దభాలపై కేసు
ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాయన్న ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు 56 గాడిదలపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర అసెంబ్లీలో రెవెన్యూ శాఖా మంత్రి ఏక్ నాధ్ ఖడ్సే చెప్పగా, సభ్యులంతా నవ్వుల్లో మునిగిపోయారు. మైనింగ్ మాఫియాపై చర్చ జరుగుతున్న సమయంలో ఖడ్సే ప్రసంగిస్తూ, ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న కేసులో ఎవరిని అదుపులోకి తీసుకున్నారో తెలుసా? అంటూ ఈ విషయాన్ని చెప్పారు. వీపుపై ఇసుక బస్తాలను ఇవి మోసుకెళుతున్నాయని చెప్పిన ఆయన, ఈ గార్దభాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని హోమ్ లో ఉంచామని, వీటికి మంచి ఆహారాన్ని అందిస్తూ, వాటి ఆలనా పాలనా చూస్తున్నామని ఆయన తెలిపారు. వాటి యజమానులమని ఎవరూ ముందుకు రాలేదని అన్నారు.