: 5 రోజుల పాటు 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్


లోక్ సభలో నేడు కూడా ఆందోళనల పర్వం కొనసాగింది. లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. దీంతో సభలో గందరగోళం చోటుచేసుకుంది. గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్న ఎంపీల పేర్లు చదివిన స్పీకర్, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. దీంతో, ఆందోళన చేస్తుంటే, సస్పెండ్ చేస్తామని బెదిరించడం సరికాదని పలువురు విపక్షనేతలు స్పీకర్ కు సూచించారు. అయినప్పటికీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ చేసిన వెంటనే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News