: ఆధార్ అనుసంధానంలో ప్రథమ స్థానంలో నిజామాబాద్ జిల్లా : భన్వర్ లాల్


ఓటరు కార్డుకు వంద శాతం ఆధార్ అనుసంధానంతో నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ వెల్లడించారు. 87 శాతం అనుసంధానంతో నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉందని తెలిపారు. 84 శాతంతో కరీంగనర్ జిల్లా మూడో స్థానంలో ఉందని కరీంనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో 80 శాతం ఆధార్ అనుసంధానం జరిగిందన్నారు. ఆధార్ లేనివారి కోసం మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓటరు గుర్తింపు అడ్రస్ కు, ఆధార్ కార్డు అడ్రస్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా ఓటర్లందరూ ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని భన్వర్ లాల్ సూచించారు.

  • Loading...

More Telugu News