: అంతా నా క్రెడిట్టే అని చెప్పుకున్న వెంకయ్య ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?: సీపీఐ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా క్రెడిట్ అంతా తనదే అని గతంలో చెప్పుకున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం అని... లేకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు రావని అన్నారు. పార్లమెంటులో పది రూపాయలకే బిర్యానీ తింటున్న ఏపీ ఎంపీలు... రాష్ట్ర సమస్యలను మాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేశారని మండిపడ్డారు. పార్లమెంటు ఉభయసభల్లో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి హిందూపురం వరకు ఆయన చేపట్టిన బస్ యాత్ర ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.