: మంత్రులకు కూడా అధికారాలు లేవు... అంతా ఏకపక్ష పాలనే: కిషన్ రెడ్డి ఫైర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తప్పుబట్టారు. హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిని తరలించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను అంచనా వేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని... సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో రైతుల పరిస్థితి ఘోరంగా తయారైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని... అంతా ఏకపక్ష పాలనే కొనసాగుతోందని... మంత్రులకు కనీస అధికారాలు కూడా లేవని మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు

  • Loading...

More Telugu News