: లలిత్ మోదీ కోసం బ్రిటన్ ప్రభుత్వంతో నేను మాట్లాడలేదు... రాజ్యసభలో సుష్మా స్వరాజ్ ప్రకటన
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి వీసా విషయంలో వచ్చిన ఆరోపణలపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమన్నారు. లలిత్ మోదీ కోసం బ్రిటన్ ప్రభుత్వంతో తాను మాట్లాడలేదని తెలిపారు. అన్ని అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని సుష్మ చెప్పారు. అయితే ఆమె ప్రకటన చేస్తుండగా విపక్షాలు వెల్ లోకి దూసుకొచ్చి తీవ్ర ఆందోళన చేశాయి. దాంతో సభలో గందరగోళం ఏర్పడటంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.