: నా కాసులెక్కడరా?... ఉజ్జయిని మహంకాళి ఆలయ అధికారులపై అమ్మవారి ఆగ్రహం


ప్రతి సంవత్సరమూ భక్తులపై అనుగ్రహ వ్యాఖ్యలు, భవిష్యత్ పై ఆశలు కల్పించేలా ఉండే మాటలతో జరిగే ఉజ్జయిని మహంకాళి 'రంగం', ఈ సంవత్సరం అమ్మవారి ఆగ్రహం, ఆమెను చల్లబరిచేందుకు ధర్మకర్తలు, పూజారుల విన్నపాలతోనే సరిపోయింది. ఆలయ అభివృద్ధి జరగడం లేదని, కాసులు ఎంతమాత్రమూ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "నా కాసులెక్కడరా?" అని ప్రశ్నించింది మహంకాళి పూనిన స్వర్ణలత. తాను కళ్లు మూసుకుని చూసీ చూడనట్టు జీవిస్తున్నానని గతంలో పావలా, అర్ధరూపాయి కానుకలు వచ్చినా, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అమ్మ పలికింది. రాబడి పెరుగుతూ ఉంటే, ఎవరికి వారు దోచుకుందామని చూస్తున్నారని అన్నారు. తన కాసులను కాజేయాలని చూస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. కాసులు గొప్పగా రాబట్టే ఆలయం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అమ్మకు మరిన్ని సేవలు జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ధర్మకర్తలు అన్నారు.

  • Loading...

More Telugu News