: అశ్లీల వెబ్ సైట్లను బ్లాక్ చేయని ఎయిర్ టెల్, ఎంటీఎస్!


కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు ఇంటర్నెట్ సేవలందిస్తున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లతో పాటు ప్రైవేటు రంగంలోని యాక్ట్, హాత్ వే, వోడాఫోన్, స్పెక్ట్రా నెట్, ఆసియా నెట్ వంటి సంస్థలు అశ్లీల వెబ్ సైట్లను బ్లాక్ చేశాయి. ఇదే సమయంలో ఎంటీఎస్, ఎయిర్ టెల్ సంస్థలు మాత్రం ఈ పని చేయలేదు. వీటిని బ్లాక్ చేయాలంటే, తమకు లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలని ఈ సంస్థలు మెలిక పెట్టినట్టు తెలుస్తోంది. బ్లాక్ చేసిన సైట్లు కొన్ని కొత్త ఐపీ సంఖ్య, కొత్త పేరుతో తిరిగి వస్తున్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కేంద్రానికి తెలియజేయడంతో, వీటిని కనిపెట్టేందుకు నిఘా విభాగం రంగంలోకి దిగింది. కాగా, లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలంటే చట్ట పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశ్లీల వెబ్ సైట్లను నిషేధిస్తే, వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లవుతుందని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేయడమే ఇందుకు కారణం.

  • Loading...

More Telugu News