: విజయవాడకు కొత్త కొత్వాల్
విజయవాడ నగరానికి కొత్త కొత్వాల్ వచ్చారు. నగర పోలీసు కమిషనర్ గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ఉద్యోగులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా విజయవాడలో పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రజల నుంచి తమకు సహకారం అవసరమని ఆయన చెప్పారు. నేరాలను అదుపులో ఉంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండే పోలీసింగ్ వ్యవస్థను తీసుకొస్తామని, సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.