: బొబ్బిలిలో ఉద్రిక్తత... జూట్ మిల్లు లాకౌట్ పై కార్మికుల కన్నెర్ర, ఫ్యాక్టరీ ముందు ధర్నా


విజయనగరం జిల్లా బొబ్బిలిలో నేటి ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లును లాకౌట్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. యాజమాన్యం నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మికులు ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు. తక్షణమే లాకౌట్ ను ఎత్తివేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ధర్నాకు దిగడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కార్మికుల నినాదాలు, పోలీసుల మోహరింపు నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News