: ప్లీజ్... కేసీఆర్ మనసు అర్థం చేసుకోండి: మంత్రి లక్ష్మారెడ్డి
ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుందని... అందుకే అక్కడ చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నామని తెలంగాణ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. పాడైపోయిన ఆసుపత్రి భవనాలను చూసి, అక్కడకు వస్తున్న రోగులు భయపడుతున్నారని చెప్పారు. ఆసుపత్రి ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఆసుపత్రి భవనాల వల్ల ప్రాణ నష్టం ఉండకూడదనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ కొత్త భవనాలను నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారని... విమర్శల జోలికి వెళ్లకుండా, ముఖ్యమంత్రి మనసును అర్థం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రి నుంచి కేవలం కొన్ని డిపార్ట్ మెంట్లను మాత్రమే తరలిస్తున్నామని... మొత్తం తీసేస్తున్నామనేది కేవలం అపోహ మాత్రమే అని చెప్పారు.