: కాల్పుల మోతతో దద్దరిల్లిన న్యూయార్క్ లోని ప్రైవేట్ పార్టీ
అప్పటిదాకా ఆనందోత్సాహాల మధ్య కొనసాగిన ఓ ప్రైవేట్ పార్టీ ఒక్కసారిగా రక్తసిక్తమయింది. ఈ ఘటన న్యూయార్క్ లోని బ్రూక్లిన్ సమీపంలోగల ఓ పెరటి తోటలో చోటుచేసుకుంది. 19 నుంచి 38 సంవత్సరాల మధ్య వయసున్న వారు పార్టీ చేసుకుంటుండగా ఓ ఆగంతుకుడు అక్కడకు వచ్చాడు. వచ్చీ రావడంతోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.