: 11 ఏళ్ల బాలుడు సహా 163 మంది భారత జాలర్లను విడుదల చేసిన పాక్


తమ జైళ్లలో ఉన్న 11 ఏళ్ల బాలుడు సహా 163 మంది భారతీయ జాలర్లను పాకిస్థాన్ విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద వారందరినీ భారత భద్రతాధికారులకు పాక్ అధికారులు అప్పగించారు. ఇటీవల రష్యాలోని వూఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల భేటీ జరిగింది. ఈ సందర్భంగా వీరిద్దరూ జాలర్ల విడుదలపై చర్చించారు. ఆ చర్చల సందర్భంగా మోదీకి షరీఫ్ ఇచ్చిన హామీ మేరకు వీరందరినీ పాక్ ప్రభుత్వం విడుదల చేసింది. వీరి విడుదలతో వాఘా సరిహద్దు వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News