: బాహుబలికి సలాం చేసిన బాలీవుడ్ బాద్షా
సంచలనం విజయం సాధించి, తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దిగంతాలకు చాటిన చిత్రం బాహుబలిపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బాహుబలిని ఆకాశానికి ఎత్తేశారు. ఎంతో కఠినమైన శ్రమకు బాహుబలి నిదర్శనమని కొనియాడారు. ఈ సినిమాలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని పొగుడుతూ... తమలో స్ఫూర్థిని నింపినందుకు షారుఖ్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప సవాలును తీసుకున్నప్పుడే అద్భుత విజయాలను సాధించగలమని చెప్పారు.