: ప్రత్యేక హోదాపై బాబుది మొసలి కన్నీరు, ధైర్యం ఉంటే కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలి: వైకాపా


ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైకాపా విమర్శించింది. ఈ ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బాబుకు ధైర్యం ఉంటే ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని, కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. హోదా విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు ఆగస్టు 10న ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News