: వీరితో లాభం లేదు, సీబీఐని రంగంలోకి దించండి: ఎంపీ రాపోలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి హత్యపై ప్రస్తుతం జరుగుతున్న విచారణలతో న్యాయం జరగదని, తక్షణం కేసును సీబీఐకి అప్పగించాలని ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలసి చర్చించారు. సీనియర్ల ర్యాగింగు వల్లే రిషితేశ్వరి బలవన్మరణానికి పాల్పడిందని చెప్పిన ఆయన సీబీఐతో విచారణ జరిపిస్తేనే, అసలు నిందితులు వెలుగులోకి వస్తారని స్పష్టం చేశారు. ఆమె మరణం వెనుక పరోక్షంగానైనా వర్శిటీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని రాపోలు వివరించినట్టు సమాచారం.