: ఎవరికీ వర్తించని చట్టం నాకేల... రాజీనామా చేయను!: రేవంత్ రెడ్డి
కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఏ నేతకూ వర్తించని చట్టం తనకు మాత్రం ఎందుకు వర్తిస్తుందని ప్రశ్నించిన ఆయన, ఇండియాలో దాదాపు 200 మందికి పైగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులపై వివిధ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. వీటిల్లో అత్యధికం విచారణ దశలో ఉన్నాయని, వీరెవ్వరూ రాజీనామాలు చేయలేదని అన్నారు. భారతరత్న అబ్దుల్ కలాంను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అహంకారంతో విస్మరించారని రేవంత్ రెడ్డి విమర్శించారు.