: డీజిల్ కార్లపై తగ్గుతున్న మక్కువ


డీజిల్ కార్లతో పోలిస్తే పెట్రోలు కార్లపైనే భారతీయులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) వెల్లడించిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. డీజిల్, పెట్రోలు ధరల మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గడమే పెట్రోలు కార్ల అమ్మకాల పెరుగుదలకు కారణమని సియామ్ అభిప్రాయపడింది. 2013-14 సంవత్సరంలో మొత్తం కార్లలో 42 శాతంగా ఉన్న డీజిల్ కార్ల వాటా, గడచిన ఆర్థిక సంవత్సరంలో 37 శాతానికి దిగిపోయింది. పెట్రోలుతో పోలిస్తే డీజిల్ కార్లు అధిక కాలుష్య కారకాలను గాల్లోకి విడుదల చేస్తాయి. ఈ నేపథ్యంలో డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గడం పర్యావరణానికి మేలు కలిగిస్తుందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, జనవరి 2014లో పెట్రోలు, డీజిల్ ధరల మధ్య రూ. 18 తేడా ఉండగా, ఇప్పుడది రూ. 11కు తగ్గింది. మరోవైపు డీజిల్ అమ్మకాలు సైతం తగ్గుతున్నాయి. 2014-15లో పెట్రోలు అమ్మకాలు 11.4 శాతం పెరుగగా, డీజిల్ అమ్మకాలు కేవలం 1.5 శాతం వృద్ధితో సరిపెట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News